AKP: నాతవరం మండలం గొల్లవీధిలో విద్యుదాఘాతంతో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందడం, మరొకరు గాయపడటంపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన, క్షతగాత్రుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా అన్ని విధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కరెంట్ షాక్ ఘటనపై ఎంపీ దిగ్భ్రాంతి


