కోనసీమ: అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం గుంటమామిడిలో తమపై ఓ పార్టీకి చెందిన వారు దాడి చేశారని YCP కార్యకర్తలు బుధవారం ఆరోపించారు. నిమజ్జనోత్సవంలో భాగంగా తాము పాటలు పెట్టుకొని డాన్సులు చేస్తూ వెళ్తుండగా పథకం ప్రకారం దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కత్తులు, కటార్లు, రాడ్లతో తమపై విరుచుకుపడ్డారని తెలిపారు. వారిని ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
YCP కార్యకర్తలపై దాడి


