హైదరాబాద్: 28°C
తెలంగాణ

పినపాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తహసీల్దార్

BDK: పినపాక మండలంలో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి గురువారం హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, చెరువులు, వాగులు, కాలువలు, నదులు, కాజ్‌వేల వద్దకు వెళ్లవద్దన్నారు. పిల్లలను నీటి వనరుల వద్దకు వెళ్లకుండా చూడాలని సూచించారు.