హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుపయోగంగా మారిన బస్ షెల్టర్

JN: జిల్లాలోని మాతా శిశు ఆసుపత్రి సమీపంలోని బస్ షెల్టర్లు నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. పిచ్చిమొక్కలు, ఆక్రమణలతో షెల్టర్లు అధ్వానంగా కనిపిస్తున్నాయి. దీంతో ఆసుపత్రికి వచ్చే గర్భిణులు, బాలింతలు బస్సుల కోసం ఎండలో రోడ్డుపైనే నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.