హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువతి మృతి.. నిందితుడి ఆత్మహత్యాయత్నం!

AKP: హైదరాబాద్ మాదాపూర్‌ హోటల్‌లో యువతి మృతి కేసులో నిందితుడైన ఈదుమెట్ల మర్రిపాలెంకు చెందిన రవితేజ ఆత్మహత్యకు యత్నించాడని సీఐ భాస్కరరావు ఇవాళ తెలిపారు. ఇంట్లో ఫ్లోర్ క్లీనింగ్ ద్రవణం తాగడంతో కుటుంబసభ్యులు కేజీహెచ్‌కు తరలించారని, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. దీనిపై మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించామని సీఐ వెల్లడించారు.