HNK: హన్మకొండ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల తెలిపారు. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు విశ్వవిద్యాలయం నుంచి వెలువడే తదుపరి ప్రకటనలను గమనించాలని సూచించారు.
తెలంగాణ
భారీ వర్షాలతో కేయూ పరీక్షలు వాయిదా


