SDPT: కోహొడ మండలంలోని శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు వాగులు, చెక్ డ్యాంల ద్వారా వరదనీరు వచ్చి ఇందులో చేరుతోంది. కొద్దిరోజులుగా నీటి మట్టం తగ్గుతూ బోసిపోయినట్లు కనిపించిన ప్రాజెక్ట్, ప్రస్తుతం నీరు వస్తుండటంతో కళకళలాడుతోంది. ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో ఒక్క శనిగరంలోనే 2000 ఎకరాల వరకు వరి నాట్లు వేయగా.. కాలువల ద్వారా నీరు పారుతోంది.
తెలంగాణ
వరద నీటితో కళకళలాడుతోన్న శనిగరం ప్రాజెక్ట్


