WGL: వరంగల్ నగరంలో గణేష్ నిమజ్జనం రెండో రోజు గురువారం కొనసాగుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణనాథుల విగ్రహాలను భక్తులు ఊరేగింపుగా చిన్న వడ్డేపల్లి చెరువు వద్దకు తీసుకువస్తున్నారు. నిమజ్జన ప్రాంతంలో సందడి నెలకొంది. ఒక్కొక్కటిగా తరలివస్తున్న విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
గంగమ్మ ఒడికి తరలివస్తున్న గణనాథులు


