హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీ వర్షాలు.. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

BHPL: భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గురువారం సింగరేణి కాకతీయ ఓపెన్‌కాస్ట్‌-2, 3 ఉపరితల గనుల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో సుమారు 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణి సంస్థకు దాదాపు రూ.కోటి మేర నష్టం వాటిల్లినట్లు సమాచారం. మరోవైపు వర్షాలతో పంటలకు మేలు జరుగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.