హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలోని రోడ్లకు మహార్దశ.. నిధులు మంజూరు

VKB: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో VKB నియోజకవర్గంలో 55.70 కి.మీ మేర 32 గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.40.60 కోట్లు మంజూరు చేస్తూ GO 494 జారీ చేసింది. ఇందులో మర్పల్లికి రూ.9.75 కోట్లు, ధారూర్‌కు రూ.8.40 కోట్లు, వికారాబాద్‌కు రూ.7.95 కోట్లు, మోమిన్ పేటకు రూ.6.70 కోట్లు, బంట్వారానికి రూ.5 కోట్లు, కోట్ పల్లికి రూ.3.30 కోట్లు కేటాయించారు.