MDK: రామాయంపేట మండలం గండ్ల శివారులో మెదక్-ఎల్కతుర్తి జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ బావి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఎన్‌హెచ్ పక్కనే ఈ బావికి, ఎలాంటి హెచ్చరిక సైన్ బోర్డులు లేకపోవడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా వాహనం నడిపినా నేరుగా బావిలోకి దూసుకుపోవడం ఖాయమంటున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
తెలంగాణ
సైన్ బోర్డులు ఏర్పాటు చేయండి..!


