హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 28.8 మి.మీ. వర్షపాతం నమోదు

EG: జిల్లాలో బుధవారం పలు మండలాల్లో వర్షాలు కురిశాయి. రాత్రి 8.30 నుంచి 9.30 గంటల మధ్య జిల్లాలో సగటున 28.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. నిడదవోలులో అత్యధికంగా 45.6 మి.మీ., గోపాలపురంలో 44.8, కోరుకొండలో 43.2, ఉండ్రాజవరంలో 38.4, చాగల్లులో 35.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లోనూ వర్షం కురిసింది.