హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములుగు జిల్లాకు రెడ్ అలర్ట్

ములుగు జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం జిల్లాలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.