హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మంలో వరద కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వరద పరిస్థితుల పర్యవేక్షణకు 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. అత్యవసర సహాయం కోసం ప్రజలు 1077 లేదా 9063211298 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. అలాగే, అధికారులు వాగులు, చెరువుల నీటి మట్టాలను గమనిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.