హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్దచెరువుకు పోలీసుల కాపలాపై కేటీఆర్ విమర్శలు

MHBD: బయ్యారం పెద్దచెరువు వద్ద పోలీసులను మోహరించడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. రైతులు తూముల ద్వారా పొలాలకు నీటిని మళ్లించుకుంటారనే ఉద్దేశంతో పోలీసులు కాపలా కాస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతుల సాగునీటి అవసరాలను తీర్చాల్సింది పోయి నీటివనరుల వద్ద పోలీసులను మోహరించడం ఏంటని ప్రశ్నించారు.