హైదరాబాద్: 28°C
తెలంగాణ

డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులకు సైబర్ వల

MDK: నర్సాపూర్‌ పట్టణంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు పేరిట సైబర్ కేటుగాళ్లు దగాకు తెరలేపారు. శ్రీరాంనగర్‌ కాలనీకి చెందిన ఓ మహిళతో పాటు పట్టణంలోని మరో మహిళకు అపరిచితులు ఫోన్ చేసి, లబ్ధిదారుల జాబితాలో పేరు చేర్చాలంటే వెంటనే ఆన్‌లైన్‌లో రూ. 5,000 పంపాలని నమ్మబలికారు. బాధితులు మున్సిపల్ అధికారులను సంప్రదించడంతో మోసం వెలుగులోకి వచ్చింది.