హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో మండల పరిషత్‌లకు ప్రత్యేక అధికారులు

కృష్ణా జిల్లాలో మండల పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో 24 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి ఆయా మండలాల్లో నియమితులైన ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించారు. మండల పరిషత్‌ల పరిపాలనా వ్యవహారాలను ఇకపై ప్రత్యేక అధికారులు పర్యవేక్షించనున్నారు.