హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు ఆత్మకూరు ఏఈ సూచనలు

NLR: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఆత్మకూరు ప్రజలకు ఏఈ జమీలా బేగం పలు సూచనలు చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. వర్షాలు పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్ తీగలు తెగిపడే అవకాశం ఉన్నందున వాటి కింద నిలబడ రాదన్నారు. తెగిన తీగలను తాకకుండా వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. ఈ విషయాలను గమనించాలన్నారు.