మహబూబాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శబరిష్ సూచించారు. చెట్లు, పాడైన భవనాల కింద ఉండవద్దన్నారు. రైతులు విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, ఉద్ధృతంగా ప్రవహించే వాగులు, కాల్వలు, నదులు, చెరువుల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
తెలంగాణ
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ


