హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: భారీ వర్షం.. ఇబ్బందులు పడుతున్న భక్తులు

కోనసీమ: ఆత్రేయపురం మండల వ్యాప్తంగా బుధవారం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో సాధారణ జనజీవనం ప్రభావితమైంది. పలు గ్రామాల్లో రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వాడపల్లి గ్రామంలో భారీ వర్షం కురవడంతో ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.