హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

ఖమ్మం జిల్లాలో రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వాగులు, వంకలు, చెరువులు, కల్వర్టుల వద్దకు వెళ్లొద్దని సూచించారు.