కృష్ణా: యూట్యూబర్ ప్రశ్న రావణ్ పోలీసుల కస్టడీ గురువారం ముగియనుంది. రావణ్ కస్టడీ విచారణ బుధవారం కూడా కొనసాగింది. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ధర్మేంద్ర ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. నగదు లావాదేవీలు, సాంకేతిక పరికరాల కొనుగోలులో సందేహాలను కూడా ఆరా తీశారు. కస్టడీ విచారణ అనంతరం సాయంత్రం 5 గంటల్లోపు విజయవాడలోని రెండో ఏజేఎంఎఫ్సీ కోర్టులో రావణ్‌ను హాజరు పర్చనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటితో ముగియనున్న రావణ్ కస్టడీ


