హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంరక్ష ఆస్పత్రిలో జిల్లా వైద్య అధికారి ఆకస్మిక తనిఖీ

WGL: వరంగల్‌ నగరంలోని సంరక్ష సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ నిబంధనల అమలు, బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణ, ఎస్‌టీపీ, ఫైర్‌ సేఫ్టీ, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.