HYD: కర్మన్‌ఘాట్‌లో ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మండమల్లమ్మ చౌరస్తా సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న బస్సులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి దిగడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
తెలంగాణ
మండమల్లమ్మ వద్ద బస్సు దగ్ధం


