హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు అనంత పద్మనాభ వ్రతం-చక్రస్నానం

తిరుమలలో ఈనెల 25న టీటీడీ ఆధ్వర్యంలో అనంత పద్మనాభ వ్రతాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ఆలయం నుంచి ఊరేగింపుగా స్వామివారి పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి ఆగమోక్తంగా పూజలు నిర్వహిస్తారు. అనంతరం అభిషేకం, చక్రస్నానం నిర్వహించి తిరిగి ఆలయానికి వేంచేపు చేస్తారు.