హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సై వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. తీవ్ర గాయాలు

KMM: తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీశ్, డ్రైవర్ రాకేష్‌లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. బుధవారం రాత్రి వినాయక నిమజ్జన విధులు ముగించుకుని తిరుమలాయపాలెం వస్తుండగా పిండిప్రోలు శివారులోని కారును లారీ ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు.తీవ్రంగా గాయపడిన ఎస్సై, డ్రైవర్‌ను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.