హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడా పాఠశాలను తనిఖీ చేసిన జడ్జి

కరీంనగర్ జిల్లా న్యాయ సేవా అధికార కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ బుధవారం ప్రాంతీయ క్రీడా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, నిల్వ గది, పడకగదులు, మరుగుదొడ్లు, భోజన ప్రదేశాల పరిశుభ్రతను పరిశీలించారు. వంటశాల పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. లోపాలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.