హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజేంద్రనగర్‌లో రూ.కోటి పలికిన లడ్డూ!

RR: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో గణేశ్ లడ్డూ వేలం రూ.1.01 కోట్లకు చేరింది. మంగళవారం అర్ధరాత్రి వరకు ఉత్కంఠగా సాగిన వేలంలో శక్తిమాన్ టీమ్ లడ్డూను దక్కించుకొంది. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలు, సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. కాగా, గతేడాది లడ్డూ రూ.2.31 కోట్లు పలికింది.