హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘లింగ నిర్ధారణకు పాల్పడితే చర్యలు తప్పవు'

KDP: గర్భంలో శిశువు లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. ఖాజా మొనుద్దీన్ తెలిపారు. బుధవారం పులివెందుల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పీసీ, పీఎన్‌డీటీ చట్టం అమలుపై నిర్వహించిన సబ్‌ డిస్ట్రిక్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కానింగ్ కేంద్రాలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.