హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.20 చిల్లర వివాదం.. ఆటో డ్రైవర్ మృతి

HYD: ఫలక్‌నుమాలో రూ.20 చిల్లర విషయంలో జరిగిన వివాదం ఓ ఆటో డ్రైవర్ ప్రాణాలు తీసింది. ఆటో ఛార్జీపై గొడవపడిన మహిళ తన కుమారుడికి ఫోన్ చేయగా, అతడు ముగ్గురు స్నేహితులతో కలిసి ఆటో డ్రైవర్‌పై దాడి చేశాడు. బైక్ తాళం చెవితో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడిన ముకర్రం మృతి చెందాడు. కేసు ఛేదించిన ఫలక్‌నుమా పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.