BHNG: బొమ్మాయిపల్లిలోని 11వ వార్డుకు చెందిన కుతాడి సత్తయ్య(65) 20 ఏళ్లుగా బోదకాలు సమస్యతో బాధపడుతున్నా ప్రభుత్వం నుంచి పింఛను అందడం లేదు. ఫైలేరియా పింఛను కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నా వ్యాధి తీవ్రత కారణంగా తిరస్కరించారని తెలిపారు. ప్రస్తుతం నడవడం కూడా కష్టంగా మారిందని, 65 ఏళ్లు వచ్చినా వృద్ధాప్య పింఛను కూడా మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
65 ఏళ్ల సత్తయ్యకు అందని పింఛను!


