హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తండాలో ముగ్గురిపై పిచ్చికుక్కల దాడి

ASF: లింగాపూర్ మండలం కీంనాయక్ తండాలో పిచ్చికుక్కలు బీభత్సం సృష్టించాయి. గోగులోత్ బలిరాం నాయక్, ఆత్రం భీమ్రావు, టేకం భీముతో పాటు పశువులపై బుధవారం రాత్రి కుక్కలు దాడి చేశాయి. గాయపడిన వారిని ఆదిలాబాద్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. పిచ్చికుక్కల భయంతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.