హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు'

EGDT: జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహకుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. జిల్లాలో 31 బ్లాక్ స్పాట్‌లు, 12 అధిక ప్రమాద ప్రాంతాలను గుర్తించామన్నారు. జనవరి నుంచి ఆగస్టు వరకు 242 ప్రమాదాలు జరిగాయని తెలిపారు.