హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కూల్‌లో విద్యార్థిపై దాడి

అన్నమయ్య: సుండుపల్లి మండలంలోని లిటిల్ ఫ్లవర్‌ హైస్కూల్‌లో రెండో తరగతి విద్యార్థిపై హిందీ ఉపాధ్యాయురాలు దాడి చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మొహమ్మద్ అలీని తీవ్రంగా కొట్టడంతో గాయాలయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ విద్యార్థులపై దాడుల ఆరోపణలు వచ్చాయని పేర్కొంటూ, ఘటనపై అధికారులు విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.