హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక నిమజ్జన స్థలంలో 108 సేవలు

జగిత్యాల జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తుల భద్రత దృష్ట్యా నిమజ్జన స్థలంలో 108 అంబులెన్సు అందుబాటులో ఉంచినట్లు జగిత్యాల జిల్లా మేనేజర్ ఆశోదా ఐలయ్య తెలిపారు. జగిత్యాల, మెట్ పల్లి, కోరుట్ల, రాయపట్నం బ్రిడ్జి దగ్గర ముందస్తుగా 108 అంబులెన్స్‌లను ఉంచినట్లు ఆయన తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉంటారన్నారు.