హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ వైర్ల చోరీ.. 10 మంది అరెస్ట్

SRD: జిల్లాలో విద్యుత్ వైర్లు, కేబుల్ చోరీ కేసుల్లో 10 మందిని హద్నూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ వివరాలు వెల్లడించారు. 13 కేసులకు సంబంధించి రూ.7.50 లక్షల విలువైన కేబుల్, అల్యూమినియం వైర్లు, రూ.4 లక్షల విలువైన టాటా ఏసీ వాహనం, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.