RR: సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తారు. నిమజ్జనం అనంతరం విగ్రహాలను హడావుడిగా తరలించకుండా పక్కా ప్రణాళిక రూపొందించాలని కోరారు. చెరువుల ప్రక్షాళనతో పాటు గణనాథుడి గౌరవం కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను గౌరవించాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
'గణనాథుడి గౌరవం కాపాడాలని డిమాండ్'


