హైదరాబాద్: 28°C
తెలంగాణ

SGF క్రీడల్లో తీగుల్ విద్యార్థుల సత్తా

SDPT: సిద్దిపేటలో జరిగిన జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ క్రీడల్లో జగదేవ్‌పూర్ మండలం తీగుల్ జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థినులు అండర్-14 విభాగంలో ప్రథమ స్థానం సాధించారు. వీరిలో ఐదుగురు రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. అలాగే బాలుర విభాగంలో వాలీబాల్ క్రీడాకారుడు సంతోష్ కూడా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికకావడం విశేషం. విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.