హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆయిల్ పామ్ సాగు విస్తరణకు కలెక్టర్ సమీక్ష

JN: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యానవన శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగును మరింత వేగవంతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఉద్యానవన తోటల పెంపకం వైపు ఆసక్తి చూపించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.