హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీవై నగర్‌లో వైభవంగా కుంకుమ పూజలు

SRCL: గణపతి నవరాత్రుల ఉత్సవంలో భాగంగా పట్టణంలోని బీవై నగర్ మండప్ ఆధ్యర్యంలో ఇవాళ అత్యంత వైభవంగా కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేసి కుటుంబ సుఖశాంతులు, అభ్యుదయం కోసం ప్రార్థనలు చేశారు. గణపతి మండపంలో భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పాటలతో అలరించారు.