హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ విధులకు ఆటంకం.. వ్యక్తి అరెస్ట్

JN: కొడకండ్ల మండల శివారులో నిన్న (మంగళవారం) పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డయల్ 112కు వచ్చిన సమాచారంతో విధుల్లో ఉన్న బ్లూకోల్ట్స్ సిబ్బందిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పాటు దుర్భాషలాడినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చింత రాజు పేర్కొన్నారు.