హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖైరతాబాద్ గణపతిని దర్శించిన కేటీఆర్

HYD: ఖైరతాబాద్ మహాగణపతిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దర్శించుకున్నారు. గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. అర్చకులు కేటీఆర్‌కు స్వామివారి ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.