హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకుల కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలు

RR: పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నేరుగా అవకాశం కల్పిస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్లను భర్తీ చేస్తున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ నాగార్జునరావు తెలిపారు. ఇబ్రహీంపట్నం, కందుకూరు, కొత్తూరు కళాశాలల్లో MPC, BiPC, CEC, HEC కోర్సుల్లో చేరవచ్చన్నారు.