హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉపాధ్యాయులపై దాడులను ఖండించిన సామకోటి

SS: విజయవాడ శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై జరిగిన దాడిని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి(పుట్టపర్తి) సామకోటి ఆదినారాయణ ఖండించారు. డీఎస్సీ నియామకాల్లో అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఉద్యోగాలు సాధించిన యువతకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో దాడులు, అశాంతిని సహించబోమని పేర్కొన్నారు.