PLD: నరసరావుపేట పట్టణంలోని వల్లప్ప చెరువు బుధవారం కురిసిన వర్షాలకు జలకళ సంతరించుకుంది. చెరువు నిండుగా నీటితో కళకళలాడుతుండటంతో పరిసర ప్రాంతాల్లో పచ్చదనం పెరిగి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. చెరువు నీటితో నిండడంతో స్థానిక ప్రజలు, సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాలతో భూగర్భ జలాలు పెరిగి చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని స్థానికులు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వల్లప్ప చెరువులో ఆహ్లాదకర వాతావరణం


