హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూకబ్జాలు అరికట్టాలని 28న పాదయాత్ర

అన్నమయ్య: రైల్వేకోడూరు మండలం వీవీ కండ్రికలో ప్రభుత్వ భూములను దళితులు, గిరిజనులకు పంపిణీ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. భూకబ్జాలను అరికట్టాలని కోరుతూ సెప్టెంబర్ 28న వీవీ కండ్రిక నుంచి కోడూరు తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ప్రభుత్వ భూములను కాపాడి అర్హులకు పంపిణీ చేయాలని కోరారు.