MNCL: చెన్నూర్ పట్టణంలోని జగన్నాథ ఆలయం ఎదుట ఉన్న వానమాముల వరదాచార్యుల విగ్రహానికి ఎలాంటి అవమానం జరగలేదని 18వ వార్డు కౌన్సిలర్ ఎతం శివకృష్ణ తెలిపారు. విగ్రహాన్ని 10అడుగులకు మార్చాలని అందరి అనుమతితో నిర్ణయించినట్లు చెప్పారు. విగ్రహాన్ని తొలగించే ముందు కుటుంబ సభ్యులు, బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు, స్థానిక కవులకు సమాచారం ఇచ్చి, వారి అనుమతితోనే మార్పునకు నిర్ణయించామని పేర్కొన్నారు.
తెలంగాణ
వరదాచార్యుల విగ్రహంపై వివాదం.. కౌన్సిలర్ క్లారిటీ!


