హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన MEOకు గ్రామస్తుల శుభాకాంక్షలు

JN: కొడకండ్ల మండలం ముండ్రాయి గ్రామ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్ రెడ్డి కొడకండ్ల ఎంఈవోగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు నేతలు అశోక్ రెడ్డిని బుధవారం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బాలెంల ఉమేష్, దౌపాటి సునీల్, మచ్చ ప్రశాంత్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.