హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

KNR: శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ సర్పంచ్ దుర్గపు సుజాత ఇటీవల మృతి చెందడంతో బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. సుజాత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపారు. కుమారుడు, కూతురు చదువుకు అవసరమైన సహాయాన్ని అందిస్తానన్నారు. ఆమె మృతి పార్టీకి తీరని లోటు అన్నారు.