హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కూటమి ప్రభుత్వానికి మద్దతు కొనసాగాలి'

నెల్లూరు నగరంలోని 16(21)వ డివిజన్ రామ్‌జీ నగర్‌లో జనసేన నేతలు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ బుధవారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి కొత్త దిశ ఏర్పడిందని వారు తెలిపారు.